అమ్మ పాత్రల్లో కనిపించే ఈ నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల, స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి.

అయితే హీరోలు, హీరోయిన్లతో పాటు ఆయా హీరోహీరోయిన్లకు అమ్మ పాత్రల్లో నటిస్తున్న హీరోయిన్లు సైతం భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారు.

నాటి తరం హీరోయిన్లు నేడు మోడర్న్ అమ్మల పాత్రల్లో కనిపిస్తూ సినిమాలు సక్సెస్ సాధించడానికి తమ వంతు కృషి చేస్తుండటం గమనార్హం.పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో నదియా పవన్ అత్త పాత్రలో నటించి మెప్పించారు.

నదియా ప్రస్తుతం రోజుకు 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.తెలుగులో సహజనటిగా గుర్తింపును సొంతం చేసుకున్న జయసుధ అమ్మ పాత్రలతో పాటు అమ్మమ్మ, నాన్నమ్మ పాత్రలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

జయసుధ ఒక్కో సినిమాకు రోజుకు రెండు లక్షల రూపాయల చొప్పున పారితోషికం తీసుకుంటున్నారు.

Advertisement

తెలుగులో టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో రేవతి ఒకరు కాగా రేవతి రోజువారీ పారితోషికం కాకుండా ఒక్కో సినిమాకు 25 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటారని తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో పవిత్ర లోకేష్ వరుసగా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.పవిత్ర లోకేష్ రోజుకు 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు.

ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉన్నా పవిత్ర లోకేష్ రెమ్యునరేషన్ ను పెద్దగా పట్టించుకోరని తెలుస్తోంది.ప్రముఖ నటి తులసి రోజుకు 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.ప్రముఖ నటి రమ్యకృష్ణ రోజుకు 6 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుండగా నటి శరణ్య రోజుకు 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రతిభ, సక్సెస్ ను బట్టి అమ్మ పాత్రల్లో నటిస్తున్న నటీమణులు పారితోషికం తీసుకుంటున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు