ఒక్క మల్టీప్లెక్స్ లో రూ.5 కోట్ల కలెక్షన్లు సాధించిన కల్కి.. ఈ రికార్డ్ మామూలు రికార్డ్ కాదుగా!

పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ), నాగ్ అశ్విన్( Nag Ashwin ) కాంబినేషన్ లో తాజాగా విడుదలైన సినిమా కల్కి.

ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

అలాగే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ సెలబ్రెటీలు కూడా ఇందులో నటించారు.గత నెల అనగా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.

అంతేకాకుండా ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడంతోపాటు ఇప్పుడు 1000 కోట్లకు దిశగా దూసుకుపోతోంది.

అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని మరోసారి అందరికి తెలిసేలా చేసింది.ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వండర్స్ క్రియేట్ చేస్తుండడంతో ఈ సినిమాను ఇంగ్లీష్ వర్షన్ లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు మూవీ మేకర్స్.అయితే అది డైరెక్ట్ ఓటీటీలో ఉంటుందా లేదంటే థియేటర్స్ రిలీజ్ చేస్తారా అనేది క్లారిటీ లేదు.

Advertisement

చైనీస్ భాషలో కూడా కల్కి2898ఏడీని రిలీజ్ చేయనున్నారు.కచ్చితంగా ఈ సినిమా హాలీవుడ్ లెవల్ లో సౌండ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

కాగా ఇప్పటికే ఈ మూవీ 1000 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా క్రాస్ చేసింది.

నార్త్ అమెరికాలో 18 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ దాటినట్లు తెలుస్తోంది.హిందీ వెర్షన్ కూడా 300 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది.ఇలా రిలీజ్ అయిన అన్ని భాషలలో కల్కికి అపూర్వ ఆదరణ లభిస్తోంది.ఇకపోతే ఈ సినిమా హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.18 రోజుల్లో ఈ ఒక్క మల్టీప్లెక్స్ లోనే 4.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.మొత్తం 400 షోలు ఇప్పటి వరకు పడ్డాయి.అలాగే 1.2 లక్షల మంది ప్రేక్షకులు ఈ సినిమాని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఇంత వరకు వీక్షించారంట.ఒక్క ప్రసాద్ లోనే 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కి చేరువగా కల్కి మూవీ ఉంది.

ఇప్పటికి డీసెంట్ వసూళ్లు వస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో ప్రసాద్ మల్టీప్లెక్స్ లో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా కల్కి 2898ఏడీ ( Kalki 2898 AD )నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు