ఫ్రీ.. ఫ్రీ.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అప్పటి నుంచే..

తాజాగా కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్ లోని మహిళల అందరికీ గుడ్ న్యూస్ అందజేసింది.అది ఏమిటి అంటే.

 Free Free Free Bus Travel For Women In Ap Since Then , Free Bus Transport, W-TeluguStop.com

ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఖరారు చేస్తూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ఆగస్టు 15( August 15) నుంచి ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్రమంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న సంగతి అందరికీ విదితమే.ఎన్నికల కంటే ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు కూటమి సర్కార్ కసరత్తు చేస్తుంది.ఇది ఇలా ఉండగా.కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, ఇంకా తల్లికి వందనం లాంటి హామీలను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం( Free bus travel) పథకం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో అమలు అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు కూడా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ఈ పథకం అమలు అవుతున్న తీరుపై నివేదికలను కూడా కోరడం జరిగింది.అలాగే ఏపీఎస్ ఆర్టీసీ( APS RTC) అధికారులు.రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణించవచ్చని, ప్రభుత్వంపై ఎంత మేరకు ప్రభావం చూపబోతోందని, అలాగే ఈ పథకం అమలులో ఎలాంటి సమస్యలు రావచ్చని లాంటి అంశాలపై పూర్తిస్థాయిలో నివేదికలను కూడా సిద్ధం చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube