అంతిమ సంస్కారానికి అధిక ఛార్జీలు..!

కరోనా కష్టకాలంలో బతుకుతున్నాం.కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతే చుట్టు పక్కల వాళ్లే కాదు కుటుంబ సభ్యులు సైతం పక్కన పెడుతున్నారు.

 Gujarath, Corona Effect, Funeral, Higher Charges-TeluguStop.com

ప్రాణ భయం బంధాలను, మానవత్వాన్ని మట్టిన కలిపింది.అంత్యక్రియలకు పాడే మోయడానికి ఆ నలుగురు కూడా రాని పరిస్థితి.

అయితే ఓ నిరుపేద కుటుంబంలో ఓ వ్యక్తి హఠాత్తుగా మరణించడంతో అంత్యక్రియలు చేయడానికి శ్మశాన వాటికకు తీసుకెళ్లారు.నిర్వాహకులు అధిక ఛార్జీలు పెంచామని చెప్పడంతో అంత మొత్తం చెల్లించలేమని, బంధువులు శ్మశానం బయట రోడ్డుపై శవాన్ని దహనం చేశారు.

ఇలాంటి విషాదకర ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకుంది.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోని ఎనాలో గ్రామంలో 45 ఏళ్ల వ్యక్తి నివాసముంటున్నాడు.

కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు.అయితే బుధవారం ఆయన హఠాత్మరణం పొందాడు.

దీంతో అతడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియలు చేయడానికి స్థానిక శ్మశానవాటికకు తరలించారు.అయితే అక్కడి సిబ్బంది మృతదేహాన్ని లోపలికి రానియ్యకుండా అడ్డుపడ్డారు.అంత్యక్రియలు నిర్వహించాలంటే రూ.2500 చెల్లించాలని, ఛార్జీలు పెరిగాయని చెప్పారు.డబ్బు కట్టి కాటికి తీసుకెళ్లమని తేల్చి చెప్పేశారు.దీంతో చేసేదేమి లేక కుటుంబ సభ్యులు రహదారి పక్కన ఉన్న ఫుట్ పాత్ పై అంత్యక్రియలు నిర్వహించారు.వీడియోను చూసిన పలువురు మనుషులు మానవత్వాన్ని మరిచారని ఆవేదన చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube