వ్యవసాయంలో ఏ పంటను సాగుచేసిన ఆ పంటపై అవగాహన ఉండడంతో పాటు కొన్ని మెళుకువలు పాటిస్తేనే అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.గులాబీ పూల విషయానికి వస్తే.
పూలలో గులాబీని రారాణిగా చెప్పుకోవచ్చు.గులాబీలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి.
పాలీ హౌస్( Polly House ) లో గులాబీ పూల సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చు.ఒకసారి నాటితే మూడు సంవత్సరాల పాటు దిగుబడులను తీయవచ్చు.
గులాబీ పంట ( rose crop )సాగుకు తేమశాతం తక్కువగా ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాలలో అధిక దిగుబడి సాధించవచ్చు.కాబట్టి పాలీ హౌస్ లో పూల సాగు చేయడం మంచిది.
రైతులు సాంప్రదాయ పంటలను వదిలి శాస్త్రీయ విధానాల( Scientific procedures ) వైపు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలో రైతులు గులాబీని సాగు చేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.గులాబీ పంటలో కీలకం కొమ్మ కత్తిరింపులు.కత్తిరింపులు చేపడితేనే గులాబీ మొక్కలు కొత్త చిగుర్లు వస్తాయి.కొమ్మలు అధికంగా వస్తే మొక్కకు ఎక్కువ పూలు పూయడానికి అవకాశం ఉంటుంది.కొమ్మ కత్తిరింపులకు అక్టోబర్ లేదా నవంబర్ మాసాలు అనుకూలంగా ఉంటాయి.
ఇక మొగ్గలు వచ్చే దశలో కచ్చితంగా మొక్కలకు ఎరువులు అందించాలి.
పూల సాగు అంటేనే శ్రమతో కూడుకున్న పని, పైగా పెట్టుబడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.ప్రణాళిక బద్ధంగా పండించి మార్కెట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి.ఒక ఏడాదిలో ఎకరం పొలంలో దాదాపుగా 8 క్వింటాళ్ల దిగుబడులు తీయవచ్చు.
పాలీహౌస్ లో మొక్కలను పెంచితే వివిధ రకాల చీడపీడల బెడద, తెగుళ్ల బెడద ఉండదు.పెట్టుబడి కూడా కాస్త ఆదా అయ్యే అవకాశం ఉంది.