నంద్యాల జిల్లా అవుకులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.ఈ మేరకు చల్లా కుటుంబంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో కారు పార్కింగ్ విషయంలో ఘర్షణ చెలరేగిందని తెలుస్తోంది.ఇదివరకే రాజకీయ ఆధిపత్యం కోసం ఘర్షణలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా కారు పార్కింగ్ విషయంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.దీంతో ఒకరిపై ఒకరు చల్లా కుటుంబ సభ్యులు పరస్పర దాడులు చేసుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో చల్లా భగీరథ రెడ్డి సతీమణి అవుకు జెడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మీపై బావ చల్లా విజ్ఞేశ్వర రెడ్డి, రఘునాథ్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి దాడి చేసినట్లు సమాచారం.కాగా ఈ ఘర్షణలో చల్లా శ్రీలక్ష్మీకి గొంతు నూలమడంతో రాత్రి 108లో బనగానపల్లె ప్రభుత్వాస్పత్రికి సిబ్బంది తరలించారు.
దాడి ఘటన నేపథ్యంలో అవుకులో చల్లా నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.