ఏపీ సర్కార్‎కు షాక్: మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు స్టే

ఏపీ మూడు రాజధానుల బిల్లుపై జగన్ సర్కారుకు హైకోర్టు షాక్ ఇచ్చింది.ఆగస్టు 14 వరకు రాజధాని బిల్లుపై స్టే విధించింది.

ఇక హైకోర్టు ధర్మాసనం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై స్టేటస్ కో ఆదేశించింది.రిప్లై కౌంటర్ వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.మరోవైపు యధాతధ స్థితి ఆగస్టు 14 వరకు కొనసాగుతోందని హైకోర్టు స్పష్టం చేసింది.

ఏపీ మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

జీఎన్ రావ్, హై పవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు.మరోవైపు రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను

అమరావతి

నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.

రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ కోర్టులో వాదనలు వినిపించారు.

గత శుక్రవారం పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు.అయితే ఈ రోజు రాజధాని విభజన బిల్లులపై విచారణ ఉండడంతో సీడ్ యాక్సిక్ రోడ్డుకు ఇరువైపులా మోకాళ్ల మీద నిలిచి వెంకటపాలెం, ఉద్ధండరాయని పాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, రాయపూడి, తుళ్లూరుకు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేశారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు