ఇంటర్ ఫలితాలలో గందరగోళం.. సీరియస్ అయిన హైకోర్ట్

గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలపై పెద్ద స్థాయిలో ఆందోళన జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.

ఫలితాలు అస్తవ్యవస్తంగా వచ్చాయని, ఫెయిల్ అయిన వారు పాస్ అయినట్లు, పాస్ అయిన వారిని కూడా ఫెయిల్ చేసి చూపించడం జరిగిందని రీ వెరిఫికేషన్ లో విపరీతంగా తప్పులు జరిగినట్లు బయట పడటంతో విద్యార్ధి సంఘాలు, మరో వైపు విద్యార్ధుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.

అయితే ఈ ఇష్యూని ప్రభుత్వం చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేయడంతో విద్యార్ధి సంఘాలు మరింత ఆందోళన ఎక్కువ చేస్తుంది.ఇదిలా ఉంటే ఇంటర్‌ బోర్డ్‌ వ్యవహారంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సీరియస్‌ అయ్యింది.రీ వాల్యూయేషన్‌పై వాదనలను విన్న ధర్మాసనం పూర్తిస్థాయి సమాచారంతో నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అక్రమాలు, ఆత్మహత్యలు చేసుకున్న మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ఇందుకు కారణమైన అధికారులపై 304 A కింద చర్యలు తీసుకోవాలని ఎలాంటి ఫీజు చెల్లించకుండా రీ వాల్యూయేషన్‌కు అనుమతివ్వాలని.బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్‌మోషన్‌ దాఖలు చేసింది.

Advertisement

పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఫలితాల్లో జరిగిన అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు