తల్లిపాలపై హైకోర్టు కీలక తీర్పు..!

బిడ్డకు తల్లిపాలకంటే శ్రేషకరమైన ఆహారం మరొకటి లేదు అనే చెప్పాలి.పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి రొమ్ము పాలు పట్టించడం చాలా అవసరం.

అలాగే తల్లికి కూడా బిడ్డకు పాలు ఇవ్వడం అనేది తనకు ఉన్న హక్కుగానే పరిగణించాలి.బిడ్డపై తల్లిగా తనకు ఉండే ఆ హక్కును, అధికారంను ఎవరు కాదనలేరు.

ఎందుకంటే ఆ బిడ్డ తన బిడ్డ కాబట్టి.ఆ బిడ్డపై సర్వహక్కులు ఆ తల్లికే చెందుతాయి.

బిడ్డ ఏడిస్తే చాలు అమ్మ మనసు తపించిపోతుంది.వెంటనే బిడ్డ ఆకలి తీర్చడానికి తన స్తన్యాన్ని బిడ్డకు ఇచ్చి బిడ్డ ఆకలి తీరుస్తుంది.

Advertisement

బిడ్డ ఆకలికి గుక్క పట్టి ఏడుస్తుంటే తల్లి చూడగలదా చెప్పండి.అటు బిడ్డని ఓదార్చలేక, ఇటు బిడ్డకు పాలు ఇవ్వలేక తనలో తానే సతమతం అయిపోతుంది.

ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదు.కానీ ఇప్పుడు ఒక కన్న తల్లికి ఆ కష్టం వచ్చి పడింది.

పొత్తిళ్ళలో ఉండగానే బిడ్డను పోగొట్టుకున్న కన్న తల్లి ఒక వైపు, అన్ని తానై బిడ్డ ఆలన పాలన చుసి పెంచిన తల్లి మరో వైపు ఉంటే వీరి ఇద్దరి మధ్య పాపం ఆ పసివాడు అల్లాడిపోతున్నాడు.అసలు వివరాల్లోకి వెళితేకన్నతల్లి - పెంపుడు తల్లి మధ్యలో నలిగిపోయిన ఓక బిడ్డ కేసు విషయం అయ్యి గురువారం రోజున హై కోర్టు ఈ తీర్పును ఇచ్చింది.

పసి పిల్లలకు తమ రొమ్ముపాలు పట్టించడం తల్లులకు రాజ్యాంగ ఇచ్చిన హక్కు అని జస్టిస్ కృష్ణ ఎస్ కృష్ణ తీర్పునిచ్చారు.సరిగ్గా ఏడాది క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రి నుంచి తన బిడ్డను దొంగలించారని తన బిడ్డ తనకు కావాలని హుస్నాబాను అనే మహిళ హైకోర్టును ఆశ్రయించింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అలాగేతన బిడ్డన అనుపమ దేశాయ్ అనే మహిళ దొంగలించి పెంచుకుంటుందని ఆరోపణ చేసింది హుస్నాబా.అయితే పెంపుడు తల్లి మాత్రం బిడ్డని కన్నతల్లికి ఇవ్వడానికి నిరాకరించింది.

Advertisement

ఈ బిడ్డను ఒక సంవత్సరం నుంచి ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో పెంచుకున్నాను.

ఆ బిడ్డను వదిలి ఉండలేను నా బాధను అర్థం చేసుకోండి అంటూ పెంచిన తల్లి ఆవేదన వ్యక్తం చేసిందికానీ తన తల్లి పాలు తాగడం అనేది ప్రతీ చంటిబిడ్డ ప్రాథమిక హక్కు అనేది ఎంత నిజమో బిడ్డలకు తన పాలు పట్టించటం అనేది కూడా ఆమెకు ఉన్న హక్కు అని కోర్టు తీర్పునిచ్చింది.అలాగే ఆర్టికల్ 21 ప్రకారం తల్లులకు రాజ్యాంగం ఇచ్చిన ఈ హక్కుని ఎవ్వరూ కాదనలేరు.అడ్డుకునే హక్కు కూడా ఎవ్వరికి లేదు అంటూ చెప్పింది హైకోర్టు.

బిడ్డని కన్న తల్లికి అప్పగించాలని చెప్పింది.కానీ పెంపుడు తల్లి మాత్రం ఆ బిడ్డతో తనకున్న అనుబంధాన్ని విడదీయవద్దు అని వారించినా గాని హైకోర్టు త్రోసిపుచ్చింది.

అసలు లోకం తెలియని పసి పిల్లలు కన్నతల్లి, పెంపుడు తల్లి మధ్య విభజించబడేందుకు ఒక వస్తువు కాదని’ ఆగ్రహం వ్యక్తం చేసింది.అలాగే పెంపుడు తల్లి ఆవేదనని కూడా అర్ధం చేసుకుని సానుభూతితో పెంచిన బిడ్డను చూసుకునే అవకాశం కల్పించింది అనుపమా దేశాయ్ కి.అప్పుడప్పుడు బిడ్డని చూసుకోవడానికి కూడా వెళ్లి రావచ్చని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది.

తాజా వార్తలు