ఉక్రెయిన్ లో భారతీయులకు కేంద్రం హై అలెర్ట్...ప్రాణాలు దక్కాలంటే ఇది తప్పనిసరి...

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడుల నేపధ్యంలో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది.

రష్యా ఎలాగినా సరే ఉక్రెయిన్ ను పూర్తిగా అదుపులోకి తీసుకోవాలని రోజు రోజుకు దాడులు వేగవంతం చేస్తోంది.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఇప్పటికే ఆక్రమించుకున్న రష్యా బలగాలు మెల్లగా ప్రధాన నగరాలలోకి చొచ్చుకుని వెళ్ళి పోతున్నాయి.ఉక్రెయిన్ సైన్యం రష్యా బలగాలని ఎదుర్కునేందుకు గట్టిగా పోరాడుతూనే ఉంది.

ఈ క్రమంలో ఉక్రెయిన్ తమ ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తూ బంకర్ లలో దాచి పెడుతోంది.ఉక్రెయిన్ లో ఉంటున్న ఇతర దేశాలకు చెందిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

ఈ నేపధ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులకు కేంద్రం కీలక సూచన చేసింది.ఉక్రెయిన్ లో చిక్కుకుని ఆందోళన చెందుతున్న భారతీయులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయుల క్షేమం కోసం అన్ని ప్రయత్నాలు చేపట్టింది.

Advertisement

ఉక్రెయిన్ సరిహద్దులకు భారతీయులు వస్తే అక్కడి నుంచీ వేరే దేశాలకు తరలించి అక్కడి నుంచీ మళ్ళీ ప్రత్యేక విమానాల ద్వారా భారత్ తీసుకు వస్తామని ప్రకటించింది.సుమారు 20 వేల మంది భారతీయులు ఉండగా ఇప్పటి వరకూ కేవలం 4 వేల మంది మాత్రమే వచ్చారని మిగిలిన వారిని సురక్షితంగా భారత్ చేర్చుతామని హామీ ఇచ్చింది.

కాగా కేంద్రం తాజాగా మరో కీలక సూచన చేసింది.ఉక్రెయిన్ ను వీడి సరిహద్దులకు వస్తున్న భారతీయులు తమ వాహనాలకు భారతీయ జెండాలను ఉంచుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

వాహనాలు ఏర్పాటు చేసుకుని వచ్చే వాళ్ళు తప్పకుండా ఈ ఆదేశాలు పాటించాలని లేదంటే ఎలాంటి పరిణామాలు అయినా చవి చూడాల్సి వస్తుందని తేల్చి చెప్పింది.భారత జాతీయ పతాకం స్పష్టంగా కనపడే విధంగా ఉండేలా వాహనాలపై ఉంచాలని ఇవే మిమ్మల్ని కాపాడు తాయని తెలిపింది.

అంతే కాదు డాలర్ల రూపంలో డబ్బులు కూడా ఉంచుకోవాలని సూచించింది.హంగరీ సరిహద్దు వద్ద, రొమేనియా సరిహద్దు వద్ద ఉన్న చెక్ పోస్ట్ లలో భారతీయులకు సహాయం చేసేందుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయని చెక్ పోస్ట్ లకు వెళ్లి వారి సాయం పొందాలని సూచించింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు