నాగార్జున సినిమాకి రీమేక్ గా 'హాయ్ నాన్న'..మరీ ఇంత మోసమా!

ఈ ఏడాది దసరా( Dussehra ) వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో టాలీవుడ్ కి మంచి ప్రారంభం ఇచ్చాడు న్యాచురల్ స్టార్ నాని( Nani ).

ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి చిత్రం లో కనిపించబోతున్నాడు అని అభిమానులతో పాటుగా ప్రేక్షకుల్లో కూడా ఆత్రుత ఉండేది.

అలాంటి సమయం లో ఆయన హాయ్ నాన్న( Hi Nanna ) అనే చిత్రాన్ని ప్రకటించాడు.మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో శౌరవ్ ( Sourav )అనే డైరెక్టర్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు.

కొత్త డైరెక్టర్ తో ఇలాంటి సాఫ్ట్ సినిమాలు ఎందుకు?, ఈమధ్య ఇలాంటి సినిమాలు అసలు ఆడడం లేదు అంటూ నాని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసారు.కానీ టీజర్ వచ్చిన తర్వాత అభిమానుల్లో భయం పోయింది, ఇక నిన్న విడుదలైన ట్రైలర్ ని చూస్తే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుంది అనే ఫీలింగ్ అందరికీ కలిగింది.

తండ్రి కూతురు మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ ఉన్న సినిమాగా మన అందరికీ అనిపిస్తుంది.డిసెంబర్ 7 వ తారీఖున ఆ ఎమోషనల్ వర్కౌట్ అయ్యి ఆడియన్స్ చేత కంటతడి పెట్టించే రేంజ్ లో సినిమా ఉంటే కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే చెప్పాలి.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా అక్కినేని నాగార్జున హీరో గా నటించిన సంతోషం ( santhosham movie )సినిమాకి దగ్గరగా ఉంటుందట.

Advertisement

సంతోషం సినిమాలో కూడా ఇంతే, నాగార్జున గ్రీసి సింగ్( Grisi Singh ) ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక కొడుకుని కంటాడు.కానీ కొడుకు చిన్న వయస్సులో ఉన్నప్పుడే గ్రీసి సింగ్ కార్ ప్రమాదం లో చనిపోతుంది.

ఆ తర్వాత కొన్నాళ్ళకు జరిగిన కొన్ని సంఘటనల వల్ల నాగార్జున శ్రియ ని పెళ్లి చేసుకోవడం తో సినిమా ముగుస్తుంది.హాయ్ నాన్న స్టోరీ లైన్ కూడా అలాంటిదే.

ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో నాని ఒక హీరోయిన్ ని ప్రేమించి పెళ్ళాడి ఒక అమ్మాయికి జన్మనిస్తాడు.అయితే ఆమె దూరం అవ్వడం తో, కూతురుతో జీవితం గడుపుతున్న నాని కి మృణాల్ ఠాకూర్ పరిచయం అవుతుంది.ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు కారణంగా ప్రేమించుకుంటారు, పెళ్లి కూడా చేసుకుంటారు.

ఇదే సినిమా స్టోరీ.లైన్ వింటుంటే మనం సంతోషం సినిమానే గుర్తుకు వస్తుంది.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

కానీ స్క్రీన్ ప్లే మొత్తం మార్చి ఉండొచ్చు.అయితే సోషల్ మీడియా లో మాత్రం ఈ చిత్రం సంతోషం రీమేక్ గానే ప్రచారింపబడుతుంది.

Advertisement

తాజా వార్తలు