ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులలో నాగచైతన్య ( Naga Chaitanya )ఒకడు.ప్రస్తుతం ఈయన చాలా సినిమాలు చేస్తు తనకంటూ ఒక మంచి పేరు గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.
ఇక ప్రస్తుతం నాగచైతన్య సినిమాల్లో బిజీ గా ఉంటూనే ఒక స్టార్ హీరోయిన్ తో లివింగ్ రిలేషన్ షిప్ ని మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా లేదా అనే విషయం మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ ప్రస్తుతం ఒక హీరోయిన్ తో తను తరచుగా ఎక్కువ గా తిరుగుతున్నాడు అంటూ వార్తలైతే సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి.
సమంత( Samantha ) తో విడిపోయినప్పటి నుంచి నాగ చైతన్య ఈ హీరోయున్ తో ఉంటున్నటుగా తెలుస్తుంది.అయితే ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం బయటికి రావడం లేదు.నిజానికి నాగచైతన్య సమంత ఒక మంచి కపుల్స్ గా చాలామంది వాళ్లను ఆదర్శంగా తీసుకొని పెళ్లి చేసుకున్నారు.ఎంతో ప్రేమగా పెళ్లి చేసుకున్న వీళ్ళే విడిపోవడం చూసిన చాలామందికి మళ్లీ వీళ్ళు కలిస్తే బాగుండు అనేంత రేంజ్ లో వాళ్ల కోసం కోరుకుంటున్నారు అంటే వాళ్ల జంట జనాల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇలాంటి క్రమంలో వీళ్లు విడిపోయి జనాలందరికి కూడా పెద్ద షాక్ ఇచ్చారు.
అయితే వీళ్ళు ఏ కారణం చేత విడిపోయారు అనేది క్లారిటీగా తెలియకపోవడంతో అభిమానులు ఇప్పటికి కూడా వీళ్ళు విడిపోవడానికి అసలైన రీజన్ ఏంటి అని వీళ్ళ మ్యాటర్ వచ్చిన ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటున్నారు.ఇదిలా ఉంటే సమంత తన సినిమాలు తను చేసుకుంటూ బిజిగా అంటుంటే, నాగచైతన్య కూడా సినిమాల్లో బిజీగా ఉంటూనే తన పర్సనల్ కెరీర్ ని చక్కబెట్టుకుంటూన్నాడు.ఇక చందు మొండేటి తో తీస్తున్న తండెల్ సినిమా మీదనే తన ఆశలు అన్ని పెట్టుకున్నాడు.