అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna )కొడుకు గా ఇండస్ట్రీకి వచ్చిన అక్కినేని అఖిల్ వరుస సినిమాలు చేస్తూ భారీ అపజయాలను అందుకుంటున్నాడు.అయితే ఈయన హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాడా లేదా అనేది కూడా చాలా మందిలో మెదులుతున్న ఒక పెద్ద ప్రశ్న గా చెప్పవచ్చు.
ఇంకా ఇలాంటి క్రమంలో అఖిల్ చేస్తున్న సినిమాలు అన్ని కూడా ఏమాత్రం ప్రేక్షకులను అలరించే విధంగా లేకపోవడం అనేది కూడా మరొక మైనస్ గా మారుతుంది.ఇక ఇలాంటి క్రమంలో వరుసగా అఖిల్ నుంచి వచ్చిన సినిమాలు డిజాస్టర్లు అవడంతో ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే అప్పట్లో కొరటాల శివ, త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ల చేత అఖిల్ కి ఒక సినిమా చేయించాలని చాలా ప్రయత్నాలు చేశాడు.అయినప్పటికీ వాళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు ఒప్పుకున్న కమిట్ మెంట్లతో బిజీగా ఉండడం వల్ల వాళ్ళు ఎవరు కూడా ఈయనతో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు.అందుకే నాగార్జున అఖిల్ కెరీర్ పట్ల చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక నాగచైతన్య ను తీసుకుంటే ఆయన సినిమాలను ఆయన చేసుకుంటూ విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు.కానీ అఖిల్ మాత్రం భారీ అంచనాలతో పెద్ద హీరో అవుతాడు అని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఒక్క హిట్టు కొట్టడానికి నానా తంటాలు పడుతున్నాడు.దాదాపు ఆయన ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా నమోదు చేసుకోలేదు ఇంకా దాంతో ఇప్పుడు అఖిల్, శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అనే టాక్ కూడా వస్తుంది…మరి ఈ సినిమాతో నైన తను సక్సెస్ కొడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమా కనక మంచి విజయం సాధిస్తే ఇక అఖిల్ ఇండస్ట్రీ లో మంచి హీరో గా ఎదుగుతాడు లేదు అంటే మాత్రం ఇక తాను ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అవ్వాల్సిందే…
.