Divya Bharti: దివ్యభారతి చనిపోయి ఇంతమంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిందా..?

నటి దివ్యభారతి ( Divya Bharti ) అతి చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

అంతేకాదు అప్పట్లో ఇండియాలోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం 19 ఏళ్ల వయసులోనే మరణించడం చాలా బాధాకరం.

ఇక ఈమె మరణ వార్తను విన్న ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.అంతేకాదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు.అయితే ఆమె మరణానికి( Divya Bharti Death Mystery ) సరైన కారణం ఇప్పటికీ కూడా తెలియదు.

దివ్యభారతి మరణం ఇప్పటికీ మిస్టరీనే.చాలామంది ఆ మిస్టరీని ఛేదించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం అంతు చిక్కడం లేదు.

Advertisement

ఇక ఆమె మద్యం మత్తులో తన ఇంటి బాల్కనీ నుండి కింద పడిపోయి చనిపోయింది అని అప్పట్లో వార్తలు వినిపించాయి.అయితే ఈ ఇండస్ట్రీకి వచ్చిన చిన్న ఏజ్ లోనే సౌత్ నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకొని తన అందచందాలతో స్టార్ హీరోయిన్ గా మారింది.

వెంకటేష్హీ రోగా వచ్చిన బొబ్బిలి రాజా సినిమా( Bobbili Raja )తో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది.ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు,ధర్మక్షేత్రం వంటి సినిమాల్లో నటించింది.

ఇవే కాకుండా హిందీలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.అయితే అలాంటి ఈ హీరోయిన్ తను చనిపోతూ కూడా చాలామంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిందట.ఇక అసలు విషయంలోకి వెళ్తే.

అప్పట్లో ఈ హీరోయిన్ క్రేజ్ ఎక్కువగా ఉండడంతో చాలామంది దర్శక నిర్మాతలు దివ్యభారతి ( Divya Bharti ) కే ఎక్కువగా అవకాశాలు ఇచ్చేవారట.దాంతో అప్పుడు ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోయిన్లకు అవకాశాలు ఉండకపోయేవట.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

కానీ దివ్యభారతి మరణానికి ముందు ఆమె దాదాపు 14 సినిమాలకు ఒప్పుకుందట.ఇక ఈమె చనిపోవడంతో ఆ 14 సినిమాల్లో హీరోయిన్ గా వేరే హీరోయిన్ లను తీసుకున్నారు.

Advertisement

అలా శ్రీదేవి, రవీనా టాండన్,టబూ, కరిష్మా కపూర్, కాజోల్( Kajol ),పూజ భట్,జుహీ చావ్లా, మమతా కులకర్ణి వంటి హీరోయిన్లు ఆమె ఒప్పుకున్నా సినిమాల్లో నటించి హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ గా మారారు.అలా దివ్యభారతి చనిపోయినా కూడా చాలామంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చింది.

తాజా వార్తలు