స్టార్ హీరో బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాల తరువాత మరో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతభాగం పూర్తి కాగా సినిమాలో హీరోయిన్ల ఎంపిక దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారింది.
కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో అఖిల్ సినిమా హీరోయిన్ సయేషా సైగల్ ను ఎంపిక చేశారు.అయితే సయేషా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

దీంతో బాలకృష్ణ బోయపాటి సినిమాకు మళ్లీ హీరోయిన్ సమస్య మొదలైంది.బాలకృష్ణ ఈ సినిమాలో రెండు పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్లు కావాలి.బోయపాటి శ్రీను ఈ సినిమాలో అవును ఫేమ్ పూర్ణను ఒక పాత్రకు ఫైనల్ చేశారు.మరో పాత్రకు ఎంతో మంది హీరోయిన్లను పరిశీలించి చివరకు సయేషాను ఫైనల్ చేయగా ఆమె ఈ సినిమా నుంచి వాకౌట్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

హీరోయిన్లు ఫైనల్ కాకపోవడం సినిమా షూటింగ్ పై ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది.అయితే సయేషా బదులుగా ఆ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేశారని సమాచారం.చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ప్రగ్యాకు స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కలేదు.గతంలో బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన జయజానకినాయక సినిమాలో ప్రగ్య జైస్వాల్ ముఖ్య పాత్రలో నటించింది.

అయితే బోయపాటి శ్రీను ప్రగ్య జైస్వాల్ తో సంప్రదింపులు జరుపుతున్నాడని ఆమెవైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని సమాచారం.సాధారణంగా బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది.అందువల్లే చాలామంది హీరోయిన్లు బాలకృష్ణ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా నటించడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.