Rashmika mandanna : కన్నడ వారు పొమ్మన్నారు.. టాలీవుడ్‌ వారు వద్దంటున్నారు

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సమస్యల్లో పడ్డట్లు అనిపిస్తుంది.రష్మిక మందన్నా కన్నడ సినిమా పరిశ్రమ ను అవమానించింది అంటూ అక్కడి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Heroine Rashmika Mandanna Not Getting Good Movie Chances  , Rashmika Mandanna, T-TeluguStop.com

కన్నడ సినిమా పరిశ్రమ కూడా ఇప్పటికే రష్మిక మందన్నా అనధికారికంగా బహిష్కరించినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ సమయం లోనే తెలుగు సినిమా పరిశ్రమ లో కూడా రష్మిక మందన్నా కి ఆఫర్స్ చాలా తగ్గాయి.

ప్రస్తుతం చేస్తున్న పుష్ప 2 కాకుండా మరి ఏ సినిమా కూడా ఈమె చేస్తున్న దాఖలాలు లేవు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.ఈమె డిమాండ్ చేస్తున్న నాలుగు ఐదు కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చేందుకు ఏ ఒక్క నిర్మాత కూడా ఆసక్తి చూపించడం లేదట.

హిందీ లో రెండు మూడు సినిమా లు తమిళంలో ఒకటి తప్ప తెలుగు లో ఈమె చేస్తున్న సినిమా లు అయితే పెద్దగా లేవు.

Telugu Allu Arjun, Bollywood, Kannada, Kantara, Pushpa, Rishab Shetty-Movie

పుష్ప గతం లోనే కమిట్ అయిన సినిమా కనుక ఇప్పుడు లెక్క లోకి వచ్చే అవకాశం లేదు అంటూ మరి కొంత మంది కామెంట్స్‌ చేస్తున్నారు.ఒక వైపు కన్నడ సినిమా పరిశ్రమ ఈమెను బహిష్కరించగా మరో వైపు తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఆఫర్స్ రాక పోవడంతో ఈమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు మా నేషనల్ క్రష్ కనిపించకుండా పోతుందా.

అక్కడ ఇక్కడ కూడా ఈమె కు ఆఫర్స్ రాకపోతే పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది.రష్మిక ఎందుకు ఇంతలో కెరీర్‌ డౌన్ ఫాల్‌ అయ్యింది.

అసలు రష్మిక మందన్నా కెరీర్‌ కు ఏమైంది.కింద పడబోతుందా అంటూ కూడా కొందరు మాట్లాడుకుంటున్నారు.

మొత్తానికి రష్మిక మందన హీరోయిన్ గా మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube