కియారా ధరించిన ఈ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా... తెలిస్తే మతి పోవాల్సిందే!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కియారా అద్వానీ (Kiara Advani) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం ఈమె రామ్ చరణ్(Ram Charan) హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి గేమ్ చేంజర్(Game Changer) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 Heroine Kiara Advani Fabulous Bag Cost 4 Lakhs Details, Kiara Advani, Kiara Adva-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే ఈమె వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న విషయం మనకు తెలిసిందే.

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రను (Siddharth Malhotra) ప్రేమించే పెళ్లి చేసుకున్నటువంటి ఈమె వీలు దొరికినప్పుడల్లా తన భర్తతో కలిసి షికార్లు చేస్తూ ఉంటారు.

Telugu Bollywood, Game Changer, Kiara Advani, Kiaraadvani, Mumbai Airport, Ram C

ప్రస్తుతం ముంబై మొత్తం వర్షాలు దంచి కొడుతున్నటువంటి నేపథ్యంలో కీయార మాత్రం ఇంట్లో ఉండకుండా తన భర్తతో కలిసి సరదాగా చిల్ అవుతూ ఉన్నారు.అయితే తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందులో భాగంగా కియారా చాలా సింపుల్ గా డ్రెస్ ధరించి హ్యాండ్ బ్యాగ్(Hand Bag) తో కనిపించారు.ఇక ఈమెకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా పిచ్చి ఎక్కువగా ఈమె హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చేస్తూ ఉంటారు.

Telugu Bollywood, Game Changer, Kiara Advani, Kiaraadvani, Mumbai Airport, Ram C

ఈ క్రమంలోనే ఈమె చేతికి ఉన్నటువంటి ఈ హ్యాండ్ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ క్రమంలోనే తన చేతికి ఉన్నటువంటి ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంత ఉంటుందని ఆరా తీయడం మొదలుపెట్టారు.కియారా చేతిలో ఉన్న పింక్ కలర్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఏకంగా నాలుగు లక్షల విలువ అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.అయితే సెలబ్రిటీలు ఇలా ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం ఇలా వారు ఉపయోగించే ఈ వస్తువుల కోసం లక్షల్లో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు.

ఇది వారికి సహజమే అయినప్పటికీ సాధారణ ప్రజలకు మాత్రం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube