కీర్తి ముక్కుపై గుద్దేసిన నితిన్.. అవాక్కైన ఫ్యాన్స్..?

మరో రెండు రోజుల్లో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

రంగ్ దే సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని భావిస్తున్న నితిన్, కీర్తి సురేష్ ఈ సినిమా ప్రమోషన్స్ ను కొత్తగా చేస్తున్నారు.

నితిన్, కీర్తి సురేష్ ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా సరదాగా ఫిర్యాదులు చేసుకుంటూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుండటం గమనార్హం.అను, అర్జున్ అనే పాత్రల్లో నటిస్తున్న నితిన్, కీర్తి సురేష్ ఆ పాత్రలపై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు.

తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.ఆ వీడియోలో నితిన్ గ్లౌవ్స్ వేసుకుని కీర్తి సురేష్ ముక్కును కొట్టాల్సి ఉండగా నితిన్ నిజంగానే గట్టిగా కొట్టేశారు.

నితిన్ అలా కొట్టడంతో కీర్తి సురేష్ కు కళ్లు బైర్లు కమ్మాయి.షూటింగ్ లో భాగంగా మెల్లిగా కొట్టమంటే నితిన్ మాత్రం గట్టిగా కొట్టడం గమనార్హం.

Advertisement

గతంలో కూడా నితిన్ కీర్తి సురేష్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కొన్ని వీడియోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే.మొదట కీర్తి సురేష్ షూటింగ్ సమయంలో నిద్రపోతున్న ఫోటోను నితిన్ షేర్ చేయగా ఆ తరువాత నితిన్ యొక్క యానిమేటెడ్ వీడియోను కీర్తి సురేష్ షేర్ చేశారు.రెండు రోజుల క్రితం కీర్తి సురేష్ కనబడటం లేదంటూ నితిన్ ఒక పోస్ట్ చేయగా సైబరాబాద్ పోలీసులు మేము కనిపెడతామంటూ రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు నితిన్ ఈ సినిమాను నువ్వేకావాలి, ఖుషీ సినిమాలతో పోల్చడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరి నువ్వేకావాలి, ఖుషి సినిమాలలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు