సూర్య కిరణ్.ప్రస్తుతం ఈ పేరు గురించి తెలియని వారు లేరనుకోండి.
బిగ్ బాస్ సీజన్ 4లోకి అడుగుపెట్టి కేవలం అంటే కేవలం ఒకే ఒక వారానికి తిరిగి వచ్చేశాడు.మొదటి వారమే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సూర్య కిరణ్.
అయితే ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేముందు చాలామందికి తెలియదు.తర్వాత తెలిసింది సూర్య కిరణ్ ఒక దర్శకుడు.
అతని భార్య మన తెలుగు ప్రేక్షకులకు తెలిసిన హీరోయిన్ కళ్యాణి అని.
కళ్యాణి తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సూర్య కిరణ్ ని ప్రేమించి పెళ్లి చూసుకుంది.సూర్య కిరణ్ కూడా అప్పట్లో మంచి డైరెక్టర్.అక్కినేని హీరో సుమంత్ నటించిన సినిమా సత్యం అప్పట్లో రికార్డులు బద్దలు కొట్టింది.ఇక ఆ సినిమా తర్వాత సూర్యకిరణ్ ఎన్ని సినిమాలు తీసిన ఒక్కటి హిట్ అవ్వలేదు.దీంతో సూర్య కిరణ్ సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు.
అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందు బిగ్ బాస్ కి వస్తే ఇక్కడ ఒక వారానికే ఎలిమినేట్ అయ్యాడు.
ఇక ఈ విషయంపై సూర్య కిరణ్ భార్య కళ్యాణి మాట్లాడుతూ ”మా అయన ఎంతో స్ట్రాంగ్ పర్సన్.
ఈ విషయం నాకు బాగా తెలుసు.కానీ మిగిలిన కంటెస్టెంట్స్ లాగ మా ఆయన
సోషల్ మీడియా
లో లేకపోవడం వల్ల సూర్య గురించి ఎవరికి తెలియలేదు.
అందుకే ఓట్లు ఎక్కువ రాలేదు.మరో వారం రోజులు ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఉంటే ఫైనల్స్ వరకు వెళ్లే ఛాన్స్ ఉండేది.
వైల్డ్ కార్డు ద్వారా మళ్లీ హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉంది ఏమో చూడాలి” అంటూ కళ్యాణి స్పందించింది.మరి కళ్యాణి అన్నట్టు బిగ్ బాస్ హౌస్ లోకి సూర్య కిరణ్ వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అవుతాడు ఏమో చూడాలి.