మాములుగా సినిమాలు షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో హీరో హీరోయిన్ లకు నటీనటులకు గాయాలవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది.ఈ మధ్యకాలంలో ఇలా షూటింగులు జరుగుతున్న సమయంలో హీరో హీరోయిన్లు గాయపడిన ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా కూడా ఒక హీరోయిన్ షూటింగ్ లో తీవ్రంగా గాయపడింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ హీరోయిన్ మరెవరో కాదు దివ్య ఖోస్లా( Divya Khosla ).
ఈమె హీరో ఉదయ్ కిరణ్( Uday Kiran ) నటించిన లవ్ టుడే( Love today ) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన విషయం తెలిసిందే.అప్పట్లో ఈ సినిమా పరవాలేదు అనిపించేలా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.ఆ తర్వాత తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది.
బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా షూటింగ్లో భాగంగా యాక్షన్స్ సన్నీ వేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడింది.
దాంతో దివ్య ఖోస్లా మొఖానికి తీవ్ర గాయం అయ్యింది.గాయం కారణంగా ఆమె మొఖం ఎర్రగా మారిపోయింది .దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో పంచుకుంది.ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు గెట్ వెల్ సూన్ అంటూ పోస్టులు పెడుతున్నారు.ఆ ఫోటోలలో దివ్య ముఖానికి చాలా తీవ్రంగా గాయాలు అయ్యాయి.ఆమె ముఖమంతా కూడా ఆ గాయాల కారణంగా ఎర్రగా మారిపోయింది.అయితే ఈ మధ్యకాలంలో వరుసగా ఇలా సెలబ్రిటీలో గాయాల పాలు అవుతుండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటికీ మొన్న అమితాబచ్చన్, సమంత, విశాల్ లాంటి సెలబ్రిటీలు షూటింగ్లో గాయపడిన విషయం తెలిసిందే.