టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
అడిగినవారికి అడగని వారికి ఎంతో మందికి లక్షలలో సహాయం చేస్తూ ఉక్కు తన గొప్ప మనసును చాటుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతోమందికి దానధర్మాలు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుత రోజుల్లో పది రూపాయలు దానం చేసిన కూడా పదిమందికి చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు.చిరంజీవి ( Chiranjeevi ) మాత్రం ఒక నటుడి కోసం దాదాపుగా 40 లక్షల రూపాయలను సహాయం చేసినప్పటికీ ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా తెలియనివ్వకుండా ఉండటం అన్నది చిరంజీవి గొప్పతనం అని చెప్పవచ్చు.
చిరంజీవి ఎవరికీ అన్ని లక్షలు ఖర్చుపెట్టాడు? ఆ నటుడు ఎవరు? అన్న వివరాల్లోకి వెళితే.ఆ నటుడు మరెవరో కాదు నటుడు పొన్నంబలం( Ponnambalam ). ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.అంతేకాకుండా స్టార్ విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పరచుకున్నారు.
తెలుగు తో పాటు తమిళ భాషలో కూడా నటించాడు.ఈ తరం ప్రేక్షకులకు ఈయన గురించి అంతగా తెలియకపోవచ్చు.90 ల కాలంలో తెలుగులో టాప్ హీరోలందరి సినిమాలలో విలన్ గా నటించి మెప్పించాడు.తమిళంలో వరుసగా సినిమాలలో నటిస్తూ కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు దూరమయ్యాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా నటుడు పొన్నంబలం ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.రెండు సంవత్సరాల క్రితం తనకు కిడ్నీ ప్రాబ్లం( Kidney Problem ) వచ్చిందని, ఎవరైనా సహాయం చేస్తారా అని వేచి చూసానని అప్పుడే తనకు చిరంజీవి గుర్తుకు రావడంతో తన ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకుని మెగాస్టార్ చిరంజీవి కి ఆరోగ్యం బాగోలేదని సహాయం చేయండి అని మెసేజ్ పెట్టాడట.
అప్పుడు మెసేజ్ చేసిన 10 నిమిషాల తర్వాత తనకి మెగాస్టార్ ఫోన్ చేసి.హాయ్ పొన్నంబలం.నేనున్నాను భయపడకు.

హైదరాబాద్ కు వచ్చెయ్ అన్నారని తెలిపారు పొన్నంబలం.అప్పుడు పొన్నంబలం నేను రాలేను అని చెప్పగా వెంటనే చిరంజీవి సరే అని చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది.అక్కడికి వెళ్లి అడ్మిట్ అవ్వు అని చెప్పారట.
చిరంజీవి చెప్పినట్లుగానే అక్కడి వెళ్లానని, ఒక్క రూపాయి తీసుకోకుండా తనకి వైద్యం చేశారని తెలిపాడు పొన్నం బలం.అలాగే తన వైద్యానికి అయిన రూ.40 లక్షలు ఖర్చుని చిరంజీవిని భరించారు అని చెప్పుకొచ్చాడు.మొదట అడగానే లక్ష రూపాయలో లేదా 2 లక్షలో చిరంజీవి సాయం చేస్తారు అనుకున్నా, గానీ 40 లక్షలు ఇస్తారని అనుకోలేదు అంటూ భావోద్వేగానికి గురైయ్యాడు పొన్నంబలం.







