హిందీ సినిమాలు సౌత్ లో ఆడవన్న సల్మాన్ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన కేజిఎఫ్ హీరో!

బాలీవుడ్ చిత్రాలు అంటే భారతీయ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవి.అయితే ఇది ఒకప్పటి మాట.

ప్రస్తుతం భారతీయ సినిమాలకు సౌత్ సినిమాలు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి.సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు జాతీయ స్థాయిలో విడుదలవుతూ మంచి గుర్తింపు పొందాయి.

సౌత్ సినిమాలకు నార్త్ లో కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తోంది.ఇక ఇదే విషయాన్ని బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ కూడా ఓ సందర్భంలో వెల్లడించారు.

సౌత్ సినిమాలకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆదరణ లభిస్తుంది కానీ, హిందీ సినిమాలకు సౌత్ లో ఎలాంటి ఆదరణ దక్కడం లేదంటూ సందేహం వ్యక్తం చేశారు.ఇక సల్మాన్ ఖాన్ కి వచ్చిన ఈ సందేహానికి కేజిఎఫ్ హీరో స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

Advertisement

ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.సల్మాన్ ఖాన్ అభిప్రాయం చాలా తప్పు ఎన్నో సంవత్సరాల నుంచి సౌత్ సినిమాలు హిందీలో డబ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఇక్కడ సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు.

ఈ విధంగా బాలీవుడ్ ప్రేక్షకులు ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడం మాకు ఎంతగానో ఉపయోగపడింది.అందుకే పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన బాహుబలి, కేజీఎఫ్ చిత్రాలకు మంచి ఆదరణ లభించింది.ఇక సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్నాయి అంటే పెద్ద ఎత్తున ప్రమోషన్ నిర్వహిస్తున్నాము.

కానీ బాలీవుడ్ చిత్రాలు విడుదల అవుతున్నాయంటే కేవలం సినిమాలను విడుదల చేసి మాపని అయిపోయింది అనుకుంటున్నారు.అయితే ఎప్పుడైతే ప్రమోషన్ చేస్తామో అప్పుడే అది జనాల్లోకి వెళ్తుందని జనాల్లోకి వెళ్ళినప్పుడే సినిమా హిట్ అవుతుంది అంటూ యశ్ చెప్పుకొచ్చారు.

బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!
Advertisement

తాజా వార్తలు