బర్త్‌డే సందర్బంగా సూర్య అరుదైన రికార్డ్‌

తమిళ స్టార్‌ హీరో సూర్య ఈనెల 23వ తారీకున తన 45వ బర్త్‌డేను జరుపుకున్న విషయం తెల్సిందే.

ఈ వయసులో కూడా సూర్య చేస్తున్న సినిమాలతో ఆయన ఫ్యాన్స్‌ ఉర్రూతలూగి పోతూ ఉంటారు.

తాజాగా ఆకాశమే నీ హద్దురా అనే చిత్రంను చేశాడు.కరోనా కారణంగా ఆ సినిమా విడుదల ఆగిపోయింది.

పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఆ చిత్రం రాబోతుంది.ఆ సినిమా నుండి పాటను విడుదల చేశారు.

ఇక బర్త్‌డే సందర్బంగా అభిమానులకు కానుకగా సూర్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంటర్‌ అయ్యాడు.ఈమద్య కాలంలో హీరోలు అంతా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేస్తున్న నేపథ్యంలో తాను కూడా ఎందుకు వెళ్లకూడదని అనుకున్నాడో ఏమో కాని బర్త్‌డే సందర్బంగా ఇన్‌స్టాలో జాయిన్‌ అయ్యాడు.

Advertisement

దాంతో ఆయన అభిమానుల ఆనందంకు అవదులు లేకుండా పోయాయి.సూర్య జాయిన్‌ అయిన 24 గంటల్లోనే దాదాపుగా 1.3 మిలియన్‌ల మంది ఆయన్ను అనుసరించడం మొదలు పెట్టారు.24 గంటల్లో ఇంతటి భారీ ఫాలోవర్స్‌ సంఖ్యను దక్కించుకోవడం అంటే రికార్డుగా చెప్పుకోవచ్చు.

సౌత్‌లో ఏ స్టార్‌ హీరోకు ఇలాంటి రికార్డు దక్కలేదు.ఒక్క రోజులోనే మిలియన్‌ మార్క్‌ ఫాలోవర్స్‌ అంటే మామూలు విషయం కాదు.తమిళ స్టార్‌ హీరో అయినా కూడా సూర్యకు సౌత్‌ ఇండియా మొత్తం కూడా మంచి క్రేజ్‌ ఉంది.

ముఖ్యంగా తెలుగులో ఈయనకు ఉన్న అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు.అందుకే ఫాలోవర్స్‌ సంఖ్య 24 గంటల్లోనే ఆ స్థాయిలో పెరిగి పోయింది.

సిద్దు జొన్నలగడ్డ పరిస్థితి ఏంటి..? క్యామియో రోల్ వల్ల ఎలాంటి నేమ్ వచ్చింది...
Advertisement

తాజా వార్తలు