నన్ను రెచ్చగొట్టదు బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చిన శివాజీ!

తెలుగు చిత్ర పరిశ్రమలో కాంట్రవర్సీ హీరోగా బయట పేరు సంపాదించుకున్నటువంటి శివాజీ( Shivaji ) ని బిగ్ బాస్ ( Bigg Boss ) కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపించిన సంగతి తెలిసిందే.

ఇలా హౌస్ లోకి వెళుతున్నారనే విషయం తెలియడంతో హౌస్ లో భారీ స్థాయిలో శివాజీ తన విశ్వరూపం చూపిస్తారని అందరూ భావించారు అనుకున్నట్టుగానే ఈయన హౌస్ లోకి వెళ్లినటువంటి మూడో రోజు పెద్ద ఎత్తున రచ్చ చేశారు.

ఏకంగా బిగ్ బాస్ కే తన స్టైల్ లో వార్నింగ్ ఇవ్వడంతో శివాజీ చేసినటువంటి కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నిజానికి శివాజీ కాఫీ( Coffee ) అంటే ఎంతో ఇష్టపడతారు.ఆయనకు కాఫీ అంటే చాలా ఇష్టం కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఒకసారి కూడా ఆయన కాఫీ తాగకపోవడంతో తనకు కాఫీ ఇప్పించమని బిగ్ బాస్ లో చాలా మర్యాదపూర్వకంగా వేడుకున్నారు.అయినప్పటికీ తనకు కాఫీ అందకపోవడంతో చిర్రెతుకు వచ్చినటువంటి ఈయన ఏకంగా బిగ్ బాస్ పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఒకవైపు శివాజీ కాఫీ కోసం బిగ్ బాస్ ను ప్రాదేయ పడుతుండగా బిగ్ బాస్ మాత్రం హౌస్ లో డాక్టర్ అయినటువంటి గౌతమ్ కృష్ణకు బిపి ఆపరేటర్ తీసుకుని శివాజీకి బీపీ( Blood Pressure )చెక్ చేయమని చెబుతారు.

Advertisement

ఇలా కాఫీ ఇవ్వకుండా తనకు బీపీ చెక్ చేయమని చెప్పడంతో కోప్పడినటువంటి శివాజీ బీపీ లేదు బొక్క లేదు.నువ్వు నాకు కాఫీ ఇస్తే తాగుతా కాఫీ కోసం ఇలా చేయాల్సిన అవసరం లేదని ఫైర్ అయ్యారు.ఇంతకుముందు సీజన్లలో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం అయ్యేది కాదు కానీ కాఫీ కోసం ఇలా రెచ్చగొట్టడం సరైనది కాదు అంటూ మాట్లాడారు.

నాలుగు రోజులుగా కాఫీ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు.బిగ్ బాస్ నన్ను టెస్ట్ చేస్తున్నారు నేను పెద్ద పెద్ద వాళ్ళని డీల్ చేశాను.నన్ను రెచ్చగొట్టొద్దు బిగ్ బాస్ అంటూ ఈయన కామెంట్ చేశారు.

నాకు ఇప్పుడే కాఫీ ఇవ్వాలని లేకపోతే తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?
Advertisement

తాజా వార్తలు