నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ప్రకాష్ రాజ్ కు ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.నటుడిగా ప్రకాష్ రాజ్ నాలుగు జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.గతంలో ప్రకాష్ రాజ్ ను పలు సినిమాలలో నటించకుండా బ్యాన్ చేయడం జరిగింది.
కర్ణాటకకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో ప్రకాష్ రాజ్ జన్మించారు.ప్రకాష్ రాజ్ డిస్కో శాంతి సోదరి లలిత కుమారిని వివాహం చేసుకోగా కొన్ని కారణాల వల్ల ఆమెకు విడాకులు ఇచ్చారు.
ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ తనకు అద్భుతమైన లైఫ్ ఇచ్చిందని టాలీవుడ్ నన్ను స్టార్ ను చేసిందని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.ఒంగోలు గిత్త పాత్ర విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయని ప్రకాష్ రాజ్ అన్నారు.
మనిషికి ఈర్ష్య అనేది కూడా అందమని దానిని నేను పర్సనల్ గా తీసుకోనని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.హిస్టారికల్ రోల్స్ లో తాను నటించలేదని ప్రకాష్ రాజ్ అన్నారు.

రాజమౌళి సినిమాలకు తాను ఎక్కువగా అవసరం పడలేదని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.యాక్టింగ్ అనేది అద్భుతమైన ప్రయాణమని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.హీరోగా తనకు ఆఫర్లు వచ్చినా దానిని పాత్రగానే చూస్తానని ప్రకాష్ రాజ్ అన్నారు.

నా ప్లస్ ఏంటో నా మైనస్ ఏంటో నాకు తెలుసని నాకు డ్యాన్స్ చేయడం రాదని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.నిర్మాతలు, డైరెక్టర్లు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదుల వల్ల నన్ను ఏడుసార్లు బ్యాన్ చేశారని అందుకు కారణాలు వంద ఉంటాయని ప్రకాష్ రాజ్ అన్నారు.అందరినీ మెప్పించడం సాధ్యం కాదని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.
మనిషికి ఒక పేరు వచ్చిన తర్వాత ఎన్నో వస్తాయని ప్రకాష్ రాజ్ అన్నారు.