పవర్ స్టార్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసిన బాలయ్య.. ఎందుకంటే?

సినిమాల పరంగా అయినా రాజకీయాల పరంగా అయినా నందమూరి కుటుంబానికి, మెగా కుటుంబానికి మధ్య పోటీ నెలకొంటూనే ఉంది.అందుకే మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ కు ఒకరంటే ఒకటికి పడదు.

 Pawan Kalyan Unstoppable Episode, Pawan Kalyan, Unstoppable 2, Balakrishna,mega-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ కామెంట్స్ చేసుకుంటారు.అయితే ప్రెజెంట్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు అందులోను పవర్ స్టార్ ఫ్యాన్స్ కు బాలయ్య తెగ నచ్చేసాడు.

మరి బాలయ్య అంతగా నచ్చడానికి కారణం ఏంటో తెలుసా? అది ఏంటంటే.బాలయ్య ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే.

ఒకవైపు ఈయన చేస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటే మరో వైపు బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో కూడా నెంబర్ వన్ షోగా నిలుస్తూ వస్తుంది.అన్ స్టాపబుల్ షోకు బాలయ్య మొదటిసారి వ్యాఖ్యాతగా మారిపోయాడు.

ఈ షో సీజన్ 1 ఘన విజయం అయ్యింది.

Telugu Balakrishna, Fans, Nandamuri Fans, Pawan Kalyan, Pawankalyan, Unstoppable

దీంతో సీజన్ 2 కూడా స్టార్ట్ చేసారు.ఇక ఇప్పుడు ఈ సీజన్ 2 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా విచ్చేసారు.పవన్ ఎపిసోడ్ ఫిబ్రవరి 2న ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అయ్యింది.

ఈ ఎపిసోడ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే వైరల్ అయ్యింది.ఎంత షో అయినా కూడా తోటి హీరోను పొగడాలంటే కొద్దిగా నొచ్చుకుంటారు.

కానీ బాలయ్య మాత్రం పవన్ కళ్యాణ్ కు కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చాడు.అంతేకాదు పవర్ స్టార్ నుండి చాలా ఆసక్తికర విషయాలను కూడా రాబట్టాడు.

Telugu Balakrishna, Fans, Nandamuri Fans, Pawan Kalyan, Pawankalyan, Unstoppable

ఈ ఎపిసోడ్ మొత్తం పవన్ ను పొగుడుతూ బాలయ్య చేసిన కామెంట్స్ ను సంతోష పరిచాయి.అలాగే పవన్ ను ఈ ఎపిసోడ్ మొత్తం బాగా నవ్వించాడు బాలయ్య.దీంతో బాలయ్య పవన్ ఫ్యాన్స్ కు బాగా నచ్చాడు అనే చెప్పాలి.ఈ ఎపిసోడ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇవ్వడమే కాకుండా ఎన్నో రికార్డులు కూడా సృష్టిస్తుంది.

పవన్ ఎపిసోడ్ హైయెస్ట్ వాచ్ అవర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.మరి ఈ ఎపిసోడ్ పార్ట్ 2 కూడా ఉండడంతో దీని కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube