తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరోలు ఐదుగురు మాత్రమే.ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు నిఖిల్.
ఈ ఐదుగురు కూడా ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా స్థాయిలో విజయాలు అందుకొని హిందీలో ముఖ్యంగా తామేంటో నిరూపించుకున్నారు.ఇక ఈ ఐదుగురులో నలుగురు హీరోలు ఒక ఎత్తు అయితే కుర్ర హీరో నిఖిల్( Nikhil Siddharth ) మరొక ఎత్తు అని చెప్పాలి.
అతను ప్రస్తుతం మోస్ట్ హపెనింగ్ హీరోగా కొనసాగుతున్నాడు.కార్తికేయ సీక్వెల్ విజయం సాధించడంతో నిఖిల్ కి రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
దీని తర్వాత మళ్లీ అదే స్థాయిలో సినిమాలను తెరకెక్కించాలని ఉద్దేశంతో ప్రస్తుతం నిఖిల్ ఐదు సినిమాల్లో నటిస్తుండగా అందులో నాలుగు చిత్రాలు ఫ్యాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం.

స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జీవిత కథ ఆధారంగా ప్రస్తుతం నిఖిల్ ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా పేరు స్పై.( Spy Movie ) ఇది అతి త్వరలో ఇది ఫ్యాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం కాగా, ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ అద్భుతంగా ఉంది.అలాగే ఈ సినిమాపై అంచనాలను కూడా పెంచింది.ఈ సినిమా తర్వాత మరొక అద్భుతమైన ఫాంటసీ డ్రామా తో ప్రేక్షకులను కనువిందు చేయడానికి నిఖిల్ రాబోతున్నాడు.దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా అనౌన్స్ చేశాడు.దీనికి స్వయంభు( Swayambhu Movie ) అనే పేరు పెట్టగా ఇందులో ఒక యోధుడి పాత్రలో నిఖిల్ కనిపించడున్నాడు.

ఈ రెండు సినిమాలే కాకుండా కార్తికేయ మూడవ భాగాన్ని( Karthikeya 3 ) కూడా తీయాలని మేకర్స్ రెడీగా ఉన్నారట.దాంతో ఈ ఫ్రాంచైజీలో భాగంగా నిఖిల్ మరో మారు మూడవ పార్ట్ తో సందడి చేయనున్నాడు.ఇక రామ్ చరణ్ నిర్మాతగా మారి ది ఇండియన్ హౌస్( The Indian House ) అనే ఒక సినిమాను తీస్తుండగా అందులో వీర్ సావర్కర్ అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ కథాంశాన్ని తీసుకుని సినిమాగా నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది.దీంట్లో కూడా నిఖిల్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.
ఇలా మొత్తంగా ఈ నాలుగు సినిమాలు కూడా పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతుండగా సుధీర్ వర్మ దర్శకత్వంలోనే నిఖిల్ మరొక సినిమా కూడా చేయనున్నాడు.ఇప్పటి వరకే స్వామి రారా, కేశవ రెడ్డి రెండు సినిమాలను సుదీర్ఘ దర్శకత్వంలో నిఖిల్ నటించాడు.
