సూపర్ స్పీడ్‌ సుందరం.. శేఖర్ మాస్టర్ తో స్టెప్పులు

నాని హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమా లు వస్తున్నాయి.

ఇటీవలే శ్యామ్‌ సింగ రాయ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకున్న నాని మరో వైపు అంటే సుందరానికి అనే సినిమా లో నటిస్తున్నాడు.

ఆ సినిమా షూటింగ్‌ జెట్ స్పీడ్‌ తో జరుగుతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కు యంగ్‌ అండ్ ట్యాలెంటెడ్‌ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌ లో ఒక స్టూడియో లో జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.శేఖర్‌ మాస్టర్ ఆధ్వర్యంలో నాని మరియు హీరోయిన్‌ నజ్రియా లపై పాట చిత్రీకరిస్తున్నారు.

ఇప్పటికే ఆ పాట షూటింగ్‌ సందడి సందడిగా జరుగుతుందని యూనిట్‌ సభ్యులు తెలియజేశారు.తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేశారు.

Advertisement

పాట షూటింగ్‌ పూర్తి అయిన నేపథ్యంలో ఈ స్టిల్స్ ను రిలీజ్‌ చేశారు.ఈ మద్య కాలంలో శేఖర్ కమ్ముల కంపోజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

దాంతో ఈ పాటకు కూడా ఆయన ట్రెండీ స్టెప్పులు వేస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.నాని మరో వైపు దసరా సినిమా షూటింగ్ కార్యక్రమాలు నేడు నిర్వహించాడు.

అంటే సుందరానికి సినిమా పూర్తి అవ్వకుండానే దసరా సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.అంటే సుందరానికి సినిమా ను ఈ ఏడాది లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.

నాని బ్యాక్ టు బ్యాక్‌ సినిమా లతో బాక్సాఫీస్ వద్ద యుద్దంకు సిద్దం అవుతున్నట్లుగా సినిమా లు చేస్తున్నారు. నాని మరో రెండు సినిమాలను కూడా కమిట్ అయ్యాడు అని సమాచారం అందుతోంది.సినిమాకు సంబందించిన వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అంటే సుందరానికి సినిమా విడుదల తేదీ విషయంలో మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు