అన్ని విషయాలు కాకపోయినా చాలా విషయాలు నేర్పింది.. చైతన్య కామెంట్స్ వైరల్?

అక్కినేని నాగచైతన్య మొట్టమొదటిసారిగా లాల్ సింగ్ చద్దా అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు.

ఈ సినిమాలో అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా నటించగా నాగచైతన్య అమీర్ ఖాన్ ఫ్రెండ్ పాత్రలో సందడి చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే ఉత్తరాది రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న నాగచైతన్యకు ఎన్నో వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలు గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన 13 సంవత్సరాల సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తాను ఇండస్ట్రీలోకి వచ్చి 13 సంవత్సరాలు కావడంతో తనకు ఇండస్ట్రీ ఎన్నో కొత్త విషయాలు నేర్పిందని, సినిమా ఇండస్ట్రీ తనకు ఎన్నో రకాల భావోద్వేగాలను పరిచయం చేసిందని వెల్లడించారు.సినీ ఇండస్ట్రీ తనకు ఎన్నో నేర్పింది ఇక్కడే తాను ఉంటున్నానని ఇంకా కొత్త విషయాలను కూడా నేర్చుకుంటానని తెలిపారు.

Advertisement

నేను నా పనిని ఎంతగానో ప్రేమిస్తున్నాను, అయితే అన్ని విషయాల క్లారిటీ అని చెప్పలేకపోయినా నటుడిగా నాకంటూ ఓ క్లారిటీ ఉందని ఈ సందర్భంగా నాగచైతన్య తన 13 సంవత్సరాల సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్యకు వృత్తిపరమైన విషయాల గురించి కన్నా వ్యక్తిగత జీవితం గురించి పలు ప్రశ్నలు ఎదురవడంతో ఈయన కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు