ఆదోనిలోని మరాఠిగేరిలో ఉండే కాశి విశ్వనాథ్ గత నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం భారిన పడినారు.అయన చిన్నప్పటి నుంచి బాలయ్య బాబుకు విరాభిమాని,ఒక్కసారైనా బాలయ్య బాబుతో కలవాలని కోరిక ఉండేది,అంతలోపే అయన తీవ్ర అనారోగ్య బారిన పడడంతో,తీవ్ర నిరాశతో బాధపడుతూ ఉండడంతో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు N.
సజ్జాద్ హుస్సేన్ కు సంప్రదించి,విషయం చెప్పడంతో,ఈ విషయాన్నీ బాలయ్య బాబుకు చెప్పడంతో,అయన వెంటనే స్పందించి video call ద్వారా కాశి విశ్వనాథ్ గారితో మాట్లాడి, ధైర్యం చెప్పారు…నేను అండగా ఉంటానని, ఏమైనా అవసరం అయితే మా అభిమానుల ద్వారా తనకు సమాచారం ఇవ్వాలని చెప్పారు, అనంతరం వాళ్ళ కుటుంబసభ్యులతో కూడా మాట్లాడారు.ఫోన్ ద్వారా బాలయ్య బాబు తో మాట్లాడిచ్చినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.







