ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎవరు ఊహించని విధంగా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని వరుస సినిమా అవకాశాలను అందుకున్న ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్నారు.
ప్రస్తుతం ఈమె రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్, అలాగే తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి నటించనున్నారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోని ఇలాంటి క్రేజ్ సంపాదించుకున్న కృతి శెట్టి గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఈమె ఓ అజ్ఞాత వ్యక్తితో ప్రేమలో ఉందని, అయితే ఈ విషయం బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఈ విషయంపై కృతి శెట్టి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు విషయం బయట పెట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఎవరినీ ప్రేమించలేదని, ప్రేమించే వయసు కూడా తనకు రాలేదని కృతి శెట్టి బాంబు పేల్చారు.ప్రస్తుతం తన దృష్టి మొత్తం తన సినిమాలపైనే ఉందని ఈమె ఈ ఇంటర్వ్యూ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.ఇలా ఇంటర్వ్యూ సందర్భంగా లవ్ ఎఫైర్ గురించి మాట్లాడుతూ తన గురించి వస్తున్నటువంటి వార్తలకు కృతి శెట్టి ఈ విధంగా చెక్ పెట్టారు.