గోవా షిఫ్ట్ అవుతున్న పుష్ప యూనిట్..!

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ముందు ఒక సినిమాగానే రిలీజ్ చేయాలని అనుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇన్నాళ్లు షూటింగ్ కు గ్యాప్ ఇచ్చిన చిత్రయూనిట్ త్వరలో మరో షెడ్యూల్ కు రెడీ అవుతుందని తెలుస్తుంది.

హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కాగానే గోవాలో అల్లు అర్జున్, రష్మికల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని తెలుస్తుంది. గోవాలో 15 రోజుల పాటు షూటింగ్ చేస్తారని తెలుస్తుంది.

హీరో, హీరోయిన్ ల మధ్య రొమాంటిక్ సీన్స్ ఈ షెడ్యూల్ లో ఉంటుందని టాక్.ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ బాగా కష్టపడుతున్నాడని తెలుస్తుంది.

Advertisement

ఇప్పటికే పుష్పరాజ్ పరిచయం టీజర్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచింది.

సినిమాలో విలన్ గా మళయాళ స్టార్ ఫహద్ ఫాజిక్ నటిస్తున్నాడని తెలిసిందే.సినిమాలో సునీల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.మొదటి పార్ట్ కు రెండు పార్ట్ కు రెండు వేరు వేరు టైటిల్స్ పెడతారని ఫిల్మ్ నగర్ టాక్.

Advertisement

తాజా వార్తలు