డ్రైవర్ జమునగా మారిన సువర్ణ.. ఫస్ట్‌ లుక్ తోనే సక్సెస్‌

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగు లో ఈమె కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చింది.

 Here Is The First Looks Of Driver Jamuna , Actress Aishwarya Rajesh , Dil Raju-TeluguStop.com

ఆ సినిమా లో ఐశ్వర్య క్రికెటర్ గా కనిపించి మెప్పించింది.తెలుగు అమ్మాయి అయినా కూడా కోలీవుడ్‌ లో మంచి విజయాలను సొంతం చేసుకుంది.

మొదట కోలీవుడ్‌ లో నిరూపించుకుని ఇక్కడ అడుగు పెట్టింది.ఇప్పుడు ఈమె నటిస్తున్న ప్రతి సినిమా కూడా తమిళంతో పాటు తెలుగు లో మరియు తెలుగు తో పాటు తమిళంలో విడుదల అవుతున్నాయి.

అంటే ఇక్కడ నటిస్తే అక్కడ.అక్కడ నటిస్తే ఇక్కడ విడుదల అవుతున్నాయి.

మొత్తానికి ద్వి భాష చిత్రాల హీరోయిన్‌ గా ఈ అమ్మడు నిలిచింది.తాజాగా ఈ అమ్మడు తమిళంలో ఒక సినిమాను చేసింది.

ఆ సినిమా ను తెలుగు లో డ్రైవర్ జమున అనే టైటిల్‌ తో విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా ఫస్ట్‌ లుక్ ను దిల్‌ రాజు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంతో అందరి దృష్టి ఆకర్షించారు.

భారీ ఎత్తున అంచనాలున్న డ్రైవర్ జమున సినిమా ను తెలుగు లో భారీ గా విడుదల చేస్తామని అంటున్నారు.షూటింగ్ ముగింపు దశకు వచ్చిందట.ఒక లేడీ డ్రైవర్‌ యాక్సిడెంట్‌ అయిన సమయంలో పడ్డ ఇబ్బందులు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఈ సినిమా లో చూపించబోతున్నారట.వరల్డ్‌ ఫేమస్ లవర్ సినిమా లో సువర్ణ గా నటించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ఐశ్వర్య ఇప్పుడు జమున పాత్ర తో మరో సారి ప్రేక్షకులను కట్టి పడేస్తుందేమో చూడాలి.

 తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమా కచ్చితంగా అక్కడ ఇక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ విశ్లేషకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube