ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.కేదార్నాథ్లో ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది.
ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృత్యువాతపడ్డారు.యాత్రికులను తీసుకు వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
కేదార్నాథ్ ఆలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది.ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ కూలిందని అధికారులు తెలిపారు.







