మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఈ సినిమా ఘన విజయం అవడంతో ఈయన క్రేజ్ పాన్ ఇండియాను సైతం దాటి హాలీవుడ్ చేరి పోయింది.
ఇక ఈ క్రేజ్ ఈయన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా కనిపిస్తుంది.చరణ్ కు రోజురోజుకూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.
తాజాగా రామ్ చరణ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసాడు.
రామ్ చరణ్ చాలా రోజుల వరకు ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ మైంటైన్ చేయలేదు.
గత కొన్ని రోజుల క్రితమే ఈయన ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టాడు.మరి అలా లేటుగా ఇంస్టాగ్రామ్ లో ఎంటర్ అయినా అతి తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకున్నాడు.
మరి ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం ఈయనకే సాధ్యం అయ్యింది.మరే హీరో కూడా ఇంత తక్కువ సమయంలో ఇంత మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకోలేక పోయారు.
ఇక ఇప్పుడు ఈయన సినిమాల లైనప్ తో కూడా మరింత ఫేమస్ అవుతున్నాడు.ముందు ముందు ఈయన సినిమాల కారణంగా మరింత ఫాలోవర్స్ ను పెంచుకోవడం ఖాయం.ఇక ప్రెజెంట్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ తో తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసాడు.RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగి పోయాయి.ఇప్పటికే ఈ సినిమా 60 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.ప్రెజెంట్ రాజమండ్రిలో శరవేగంగా షూట్ జరుపు కుంటుంది.

మెగా ఫ్యాన్స్ కూడా RC15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.







