కేదార్‎నాథ్‎లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.కేదార్‎నాథ్‎లో ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది.

ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృత్యువాతపడ్డారు.యాత్రికులను తీసుకు వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం.

కేదార్‎నాథ్‎ ఆలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది.ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ కూలిందని అధికారులు తెలిపారు.