'శ్యామ్ సింగ రాయ్' నిర్మాతలకు ఆ విషయంలో భారీ లాస్..!

టాలీవుడ్ న్యాచులర్ స్టార్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని ప్రతి సినిమా మినిమమ్ గ్యారెంటీ అయ్యే విధంగా చేసాడు.ఈయన సినిమా రాబోతుందంటే ఏదో కొత్తదనం ఆశిస్తారు ఆడియన్స్.

 Heavy Rains In Hyderabad Damages The Sets Of Shyam Singha Roy, Nani, Shyam Singh-TeluguStop.com

ప్రస్తుతం కోవిద్ కారణంగా సినిమాలు విడుదల కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ నాని వరస సినిమాలు మాత్రం లైన్లో పెట్టాడు.నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమా ఏప్రిల్ 23 న విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇప్పుడు మరొక సినిమా స్టార్ట్ చేసాడు నాని.రాహుల్ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా ఫస్ట్ లుక్ అభిమానులకు బాగా ఆకట్టుకుంది.

Telugu Heavy, Heavyhyderabad, Hyderabad, Kriti Shetty, Nani, Natural, Sai Pallav

ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా నాని సినిమాల్లో అన్నిటికన్నా ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.

ఇప్పుడు ఉన్న కరోనా కారణంగా కలకత్తాలో షూటింగ్ జరగడం కుదరదు.కాబట్టి కలకత్తా బ్యాక్ డ్రాప్ సెట్ ను 10 ఎకరాల విస్తీర్ణంలో 6 కోట్లతో బడ్జెట్ తో నిర్మించారు.

కానీ ఇప్పుడు ఈ సెట్ వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా సెట్ కొద్దిగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది.ఇంకా కొన్ని రోజులు ఈ సెట్ ఇలానే ఉంటె సెట్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.

అలానే జరిగితే భారీ ఖర్చుతో వేసిన సెట్ కారణంగా నిర్మాతలకు భారీ నష్టం తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube