వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

ఆస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం సీఎం జగన్, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

జగన్ కేసులను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలన్న గత పిటిషన్ తో బెయిల్ రద్దు పిటిషన్ ను సుప్రీంకోర్టు పిటిషన్ ను జోడించింది.అనంతరం తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : దిల్ రాజు
Advertisement

తాజా వార్తలు