ఉండవల్లి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా

మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ ఉండవల్లి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కేసులో కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్ తెలిపారు.అయితే 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చామని రిజిస్ట్రార్ కోర్టుకు వెల్లడించారు.

మిగతా వారి అడ్రస్ లు తప్పుగా ఉండటంతో నోటీసులు చేరలేదని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చేందుకు అనుమతించాలని పిటిషనర్ కోర్టును కోరగా.

మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు