ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case )లో నిందితుల కస్టడీ పిటిషన్ పై హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును కస్టడీకి కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి నిందితుల తరపు లాయర్లు సమయం కోరారు.ఈ నేపథ్యంలో నిందితుల తరపు న్యాయవాదులు ఇవాళ కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు.కాగా ఈ కేసులో ఏ1గా ప్రణీత్ రావు, ఏ2 గా భుజంగరావు, ఏ3 గా తిరుపతన్న( Bhujanga Rao, Tirupatanna )లను పోలీసులు చేర్చారు.ముగ్గురినీ కలిపి విచారించాలని పోలీసులు కస్టడీ కోరారు.
కాగా ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు ఇవాళ విచారణ జరపనుంది.