Nani Dasara 2 : దసరా 2 కూడా రాబోతోందా.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నాని?

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు నాని ( Nani ) ఒకరు.ఈయన కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.

 Interesting Update Goes Viral About Nani Dasara 2 Movie-TeluguStop.com

అనంతరం సినిమా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఇక ఇటీవల కాలంలో నాని నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయి.

గత ఏడాది నాని రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

శ్రీకాంత్ ఒదేలా( Sreekanth Odela ) దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా( Dasara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత ఈయన హాయ్ నాన్న( Hai Nanna ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇలా గత ఏడాది రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇకపోతే తాజాగా నాని మరో క్రేజీ అప్డేట్ విడుదల చేశారు.సూపర్ హిట్ సినిమా అయినటువంటి దసరా సినిమాకు సీక్వెల్ చిత్రం రాబోతుందని వెల్లడించారు.దసరా 2( Dasara 2 ) ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఈ ఏడాది ద్వితీయార్థం నుండి మొదలు కానుందట.అంటే 2024 చివర్లో లేదా 2025 ప్రారంభంలో షూటింగ్ మొదలయ్యే సూచనలు కలవు.

ఈ సినిమాలో  కీర్తి సురేష్ ( Keerthy Suresh ) హీరోయిన్గా నటించారు.ఇక ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలకు ఈయన కమిట్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube