దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ముప్పు అంతకంతకూ పెరుగుతోంది.ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి.
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.దీనిపై ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ పలు దడ పుట్టించే విషయాలు వెల్లడించారు.
ఢిల్లీలో కరోనా ముప్పు నిరంతరం పెరుగుతున్నదని ఆయన అన్నారు.బుధవారం ఢిల్లీలో కొత్తగా 10 వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి.
దీంతో కరోనా ఇన్ఫెక్షన్ రేటు 10 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత రెండు రోజులుగా ఢిల్లీలో రోజుకు 4 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కరోనా ప్రాణాంతక మహమ్మారి బారిన పడినట్లున్నదని మంత్రి వ్యాఖ్యానించారు.రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి.
రోజురోజుకు బయటకు వస్తున్న లెక్కలు భయపెడుతున్నాయని ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ పేర్కొన్నారు.

మంగళవారం ఢిల్లీలో కొత్తగా 5,481 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రి తెలిపారు.ఢిల్లీలో కరోనా సంక్రమణ రేటు 8.37శాతంగా ఉంది.దేశంలో మూడో వేవ్.ఢిల్లీలో ఐదో వేవ్ వచ్చాయని సత్యేంద్ర జైన్ అన్నారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ ప్రస్తుతం దాని లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయని అన్నారు.ఇది కాస్త ఉపశమనం కలిగించే అంశమన్నారు.
ప్రజలంతా అత్యవసరమైతే తప్ప బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.