ఏపీలో పలువురు డాక్టర్లకు వైద్యారోగ్య శాఖ నోటీసులు

ఏపీలో సంవత్సరానికి పైగా విధులకు హాజరు కాని వైద్యులపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది.

ఈ మేరకు 78 మంది డాక్టర్లకు వైద్యారోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది.

మెడికల్ కాలేజీల్లో ఏడాదికి పైగా విధులకు గైర్హాజరు అవుతున్న అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను సర్వీస్ నుంచి తొలగించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఇద్దరు అసోసియేట్స్ తో పాటు 76 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గత నెల 20న ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలోనే తాజాగా తదుపరి చర్యల కోసం గెజిట్ విడుదల చేసింది.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు