వారెవ్వా..వాట‌ర్ యాపిల్‌తో అన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్టొచ్చా?

యాపిల్ తెల‌సు, గ్రీన్ యాపిల్ తెలుసు, ఐస్ యాపిల్ కూడా తెలుసు.మ‌రి ఈ వాట‌ర్ యాపిల్ ఏంట‌బ్బా.

? అనేగా మీ డౌట్‌.వేస‌విలో విరి విరిగా కాసే ఈ వాట‌ర్ యాపిల్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది.

చాలామందికి పెద్దగా తెలియని ఈ వాట‌ర్ యాపిల్‌ను వైట్ జామూన్ అని, జంబూ ఫలం అని కూడా పిలుస్తుంటారు.చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉండే ఈ వాట‌ర్ యాపిల్స్ కొంచెం తియ్య‌గా, కొంచెం వ‌గ‌రుగా ఉంటాయి.

ఈ పండ్ల‌లో నీటి శాతం అధికంగా ఉంటుంది.ఇక నోట్లో వేసుకున్న వెంటనే క‌రిగిపోయే ఈ వాట‌ర్ యాపిల్స్‌లో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.

Advertisement

విటమిన్ బి, విట‌మిన్ సి, కాల్షియం, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు వాట‌ర్ యాపిల్ ద్వారా పొందొచ్చు.అందుకే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ను పెంచుకోవాలి అని ప్ర‌య‌త్నించే వారు ఈ వాట‌ర్ యాపిల్‌ను తీసుకోవ‌డం చాలా మంచిది.వాట‌ర్ యాపిల్‌లో ఉండే విట‌మిన్ సి, జింక్ పోష‌కాలు.శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

దాంతో వైర‌స్‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు ఈ వాట‌ర్ యాపిల్ ఓ దివ్యౌషధంగా పని చేస్తుంది.

అవును, ఈ పండ్ల‌ను తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.స‌మ్మ‌ర్‌లో ఆ వాట‌ర్ యాపిల్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

ఒత్తిడి, మాన‌సిక అందోళ‌న‌, అల‌స‌ట‌, నీర‌సం వంటి స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.అధిక ర‌క్త పోటును త‌గ్గించ‌డంలోనూ ఈ వాట‌ర్ యాపిల్ స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

రెగ్యుల‌ర్‌గా ఒక‌టి చ‌ప్పున ఈ వాట‌ర్ యాపిల్‌ను తీసుకుంటే.ర‌క్త పోటు కంట్రోల్‌లో ఉంటుంది.

తాజా వార్తలు