దానిమ్మ పండ్లే కాదు ఆకుల‌తోనూ మ‌స్తు బెనిఫిట్స్ పొందొచ్చు!

దానిమ్మ పండ్లు రుచిగా ఉండ‌ట‌మే కాదు.ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలూ అందిస్తాయి.

అందుకే రోజుకొక దానిమ్మ పండును తింటే అనేక రోగాల‌కు దూరంగా ఉండొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

అయితే దానిమ్మ పండ్లే కాదు.

దానిమ్మ ఆకులు సైతం ఆరోగ్యానికి మాస్తు బెనిఫిట్స్‌ను అందిస్తాయి.అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

పోష‌కాలెన్నిటినో క‌లిగి ఉండే దానిమ్మ ఆకులు.అనేక జ‌బ్బుల‌ను నివారించ‌గ‌ల‌వు.

Advertisement

మ‌రి దానిమ్మ ఆకుల ప్ర‌యోజ‌నాలు ఏంటీ.? అస‌లు వాటిని ఎలా ఉప‌యోగించాలి.? వంటి విష‌యాల‌ను లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డంలో దానిమ్మ ఆకులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అందుకోసం కొన్ని దానిమ్మ ఆకుల‌ను తీసుకుని మెద్ద‌గా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఈ ర‌సంలో కొద్దిగా వాట‌ర్ యాస్ చేసి.

అప్పుడు నీట్లో పోసుకుని పుక్కిలించాలి.ఇలా రోజూ ఉద‌యం, సాయంత్రం చేస్తూ ఉంటే నోటి దుర్వాస‌న స‌మ‌స్య దూరం అవుతుంది.

మ‌రియు దంత‌, చిగుళ్ల స‌మ‌స్య‌లు ఏవైనా ఉన్నా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

జ‌లుబు, ద‌గ్గు స‌మ‌స్య‌ల‌నూ త‌గ్గించ‌డంలోనూ దానిమ్మ ఆకులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.దానిమ్మ ఆకులను శుభ్రం చేసి నీటిలో వేసుకుని మ‌రిగించాలి.బాగా మ‌రిగిన త‌ర్వాత నీటితో వ‌డ‌బోసుకుని తేనె క‌లిపి సేవించాలి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఇలా రోజుకు ఒక సారి చేస్తే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.మొటిమ‌ల‌ను నివారించ‌డంలోనూ దానిమ్మ ఆకులు స‌హాయ‌ప‌డ‌తాయి.కొన్ని దానిమ్మ ఆకుల‌ను తీసుకుని మెత్త‌గా నూరి.

Advertisement

మొటిమ‌లపై పెట్టాలి.ప‌ది నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేస్తే మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు త్వ‌ర‌గా పోతాయి.ఇక దానిమ్మ ఆకుల‌ను మెత్తగా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.

ఆ ర‌సాన్ని రోజుకు రెండు స్పూన్ల చ‌ప్పున సేవిస్తే.గ్యాస్‌, ఎసిడిటీ, అజీర్తి, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌న్నీ దూరం అవుతాయి.

మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు సైతం మెరుగుప‌డుతుంది.

తాజా వార్తలు