ప్రతిరోజు ఒక్క టమాటా తో ఇలా చేస్తే.. ఎముకలు బలంగా మారడం ఖాయం..!

మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయలలో టమాటాలు( Tomatoes ) ఎంతో ముఖ్యమని దాదాపు చాలామందికి తెలుసు.

ఇవి సంవత్సరం పొడుగునా మనకు అందుబాటులో ఉంటాయి.

అలాగే ఇందులో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.ఇక వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

అయితే టమాటాలను ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతూ ఉంటారు.అందువల్ల టమాటాలను తినేందుకు చాలా మంది భయపడుతూ ఉంటారు.

కానీ వాస్తవానికి టమాటాలను పచ్చిగా తింటేనే కిడ్నీ స్టోన్స్( Kidney Stones ) ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

వండుకొని తినడం వల్ల ఎలాంటి స్టోన్స్ రావని కూడా వైద్యులు చెబుతున్నారు.కాబట్టి టమాటాలను పచ్చిగా తినకుండా వండుకొని తినడమే మంచిది.ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.

ఎముకలను గుల్లగా మార్చి బలహీనంగా చేసే ఆస్టియో పోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్( Osteoarthritis ) రాకుండా చూడడంలో టమాటాలు కీలక పాత్ర పోషిస్తాయి.కాబట్టి రోజు కనీసం ఒకటి అయినా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే టమాటాల్లో లైకోపీన్‌ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.

లైకోపీన్‌ ఎముకల్లోనీ క్యాల్షియం బయటకు పోకుండా చూస్తుంది.క్యాల్షియం ఎముకలకు బాగా అందేలా చూస్తుంది.

యూకే ఎన్నికల్లో సిక్కు సంతతి ఎంపీల ప్రభంజనం.. అకల్ తఖ్త్ , ఎస్‌జీపీసీ ప్రశంసలు
సినిమా ఫ్లాప్ అయినా వాణిశ్రీ కట్టిన ఆర్గాండి వాయిల్ చీరలు ఫుల్ ఫేమస్

దీంతో ఎముకలు గుల్ల భారీ పోకుండా బలంగా ఉంటాయి.వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్‌, ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Advertisement

అలాగే మనం తీసుకునే ఆహారంలో ఉండే క్యాల్షియం ఎముకలకు సరిగ్గా అందేలా చేయడంలో లైకోపీన్( Lycopene ) ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇంకా చెప్పాలంటే వయసు పైబడిన వారికి సహజంగానే కీళ్ల నొప్పులు( Knee Pain ) ఇతర ఎముకల సమస్యలు వస్తూ ఉంటాయి.వారు సైతం రోజుకు ఒక్క టమోటా ను తినాలని వైద్యులు చెబుతున్నారు.కానీ దాన్ని పచ్చిగా కాకుండా వండుకొని తినాలని చెబుతున్నారు.

తాజా వార్తలు