పచ్చిమిరపకాయలు రోజు తినాలి....ఎందుకో తెలుసా?

సాధారణంగా మనం ప్రతి రోజు వంటల్లో పచ్చిమిర్చిని వాడుతూనే ఉంటాం.చాలా మంది కూరల్లో ఎర్ర కారానికి బదులుగా పచ్చిమిర్చిని ఎక్కువగా వాడుతూ ఉంటారు.

కూరల్లో పచ్చిమిర్చిని వాడటం వలన వంటకు మంచి రుచి వస్తుంది.అయితే పచ్చిమిర్చి తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.పచ్చిమిర్చిలో విటమిన్ సి,విటమిన్ బి6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి.

పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది.

Advertisement
Health Benefits Of Green Chillies, Green Chilli, Anti Bacterial,Skin Problems-�
Health Benefits Of Green Chillies, Green Chilli, Anti Bacterial,skin Problems

పచ్చిమిర్చిని గింజలతో కలిపి తినటం వలన జీర్ణశక్తి మెరుగుపడి అజీర్ణం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.చాలా మంది పచ్చిమిర్చిని ఉపయోగించినప్పుడు గింజలను తీసేస్తూ ఉంటారు.అలాంటి వారు గింజలు తీయకుండా తినటం అలవాటు చేసుకోవాలి.

పచ్చిమిర్చి గింజల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం సమృద్ధిగా ఉండుట వలన రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించటమే కాకుండా పేగుల నుంచి కొలెస్ట్రాల్ రక్తంలోకి చేరకుండా చూస్తుంది.

Health Benefits Of Green Chillies, Green Chilli, Anti Bacterial,skin Problems

పచ్చిమిర్చిలో క్యాప్సెయిసిన్ సమృద్ధిగా ఉండుట వలన మెటబాలిజం రేటును పెంచుతుంది.దాంతో క్యాలరీలు త్వరగా కరగటం వలన బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.పచ్చి మిరపకాయల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి.

అందువల్ల ఇవి చర్మ సమస్యలను తొలగిస్తుంది.

మనం రోజు చూసే ఈ సినిమాలకు డబ్బింగ్ చెపుతున్న హీరో హీరోయిన్స్
Advertisement

తాజా వార్తలు