కోడి గుడ్లే కాదు బాతు గుడ్లు ఆరోగ్య‌మే.. వారానికి ఎన్ని సార్లు తినొచ్చంటే..?

గుడ్లు సంపూర్ణ పోషకాహారం అన్న సంగతి మనందరికీ తెలిసిందే.అందుకే చాలా మంది నిత్యం రోజుకు ఒక ఉడికించిన గుడ్డును తింటూ ఉంటారు.

అయితే గుడ్లు అనగానే మనందరికీ కోడి గుడ్డులే గుర్తుకు వస్తాయి.ఎందుకంటే వాటినే మనం తింటూ ఉంటాము.

కానీ కోడి గుడ్లే కాదు బాతు గుడ్లు( Duck Eggs ) కూడా ఆరోగ్యమే అంటున్నారు నిపుణులు.కోడిగుడ్లు మాదిరిగానే బాతు గుడ్లలో సైతం పోషకాలు మెండుగా ఉంటాయి.

బాతు గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్ కె, విటమిన్ బి12, విటమిన్ డి, ఐరన్, సెలీనియం కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోష‌కాలు పుష్కలంగా ఉంటాయి.అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువే.

Advertisement

అందువల్ల బాతు గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా బాతు గుడ్లు మీ బ్రెయిన్ కు చాలా మంచివి.బాతు గుడ్లు మెదడుకు అవసరమైన కొవ్వులు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.

మెదడు కణాలను రక్షిస్తాయి మరియు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.బాతు గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

ప్రోటీన్ కొరతతో బాధపడే వారికి బాతు గుడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

అలాగే ఆరోగ్యకరమైన దృష్టికి, మచ్చల క్షీణతకు మరియు కంటిశుక్లం వంటి కొన్ని కంటి వ్యాధుల( Eye diseases ) నివారణకు బాతు గుడ్లు ఉత్తమంగా సహాయపడతాయి.అంతేకాదు బరువు నిర్వహణలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, క్యాన్సర్ వచ్చే రిస్క్ ను తగ్గించడంలో, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, కండరాలకు బలాన్ని చేకూర్చడంలో బాతు గుడ్డులో ఉండే పోషకాలు అద్భుతంగా తోడ్పడతాయి.అయితే బాతు గుడ్లలో అధిక కొవ్వు మరియు కొలెస్ట్రాల్ కంటెంట్ ఉంటుంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

అందువల్ల బాతు గుడ్లను రెగ్యులర్ గా తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి వారానికి ఒకసారి మాత్రమే బాతు గుడ్లను తీసుకోవడానికి ప్రయత్నించండి.ఇక కొందరికి ఎగ్ అలర్జీ ఉంటుంది.

Advertisement

అలాంటి వారు బాతు గుడ్లకు దూరంగా ఉండటమే ఉత్తమం.

తాజా వార్తలు