బ్ల‌డ్ డొనేష‌న్ చేస్తే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?

బ్లడ్ డొనేష‌న్‌(ర‌క్త దానం). అంటే చాలా మంది తెగ భ‌యప‌డి పోతుంటారు.

బ్ల‌డ్ డొనేట్ చేస్తే త‌మ శ‌రీరంలో ర‌క్తం త‌గ్గిపోతుంద‌ని భావిస్తుంటారు.కానీ, బ్ల‌డ్ డొనేష‌న్ చేయ‌డం వ‌ల్ల ఎంతో మందికి సాయం చేసిన‌ట్టు అవుతుంది.

అదే స‌మ‌యంలో బోలెడ‌న్ని ఆరోగ్య లాభాలూ ల‌భిస్తాయి.అవును, మూడు నెల‌ల‌కు ఒక సారైనా బ్ల‌డ్ డొనేట్‌ చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు అందుతాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ప్రతి మూడు నెలలకొక‌రి రక్తదానం చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి గుండె ఆరోగ్యంగా మారు తుంది.దాంతో గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే బ‌రువు త‌గ్గ‌డానికి కూడా బ్ల‌డ్ డొనేష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

బ్ల‌డ్ డొనేష‌న్ చేసిన‌ప్పుడు శ‌రీరంలో ఉన్న అద‌న‌పు కేల‌రీలు అన్నీ క‌రిగి పోతాయి.త‌ద్వారా వెయిట్ లాస్ అయ్యి ఫిట్‌గా త‌యారు అవుతారు.

ఐర‌న్ కంటెంట్ త‌క్కువగా ఉంటేనే కాదు.ఎక్కువ‌గా ఉన్నా ఆరోగ్యానికి ప్ర‌మాద‌మే.

అయితే ర‌క్త దానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉత్పత్తి అయ్యే ఐరన్ శాతం పూర్తి నియంత్రణలో ఉంటుంది.ఫ‌లితంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

అంతే కాదు, మూడు నెల‌ల‌కు ఒక సారి బ్ల‌డ్ డొనేష‌న్ చేయ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ్యాధి వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

Advertisement

లివ‌ర్ వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మ‌రియు రక్త దానం చేయడం వల్ల కొత్త బ్లడ్ సెల్స్ ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది.చూశారా రక్త దానం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో.

కాబ‌ట్టి, ఇక‌పై ర‌క్త దానం చేయ‌డం అల‌వాటు చేసుకోండి.

తాజా వార్తలు