ఇలాంటి వింతైన సైకిల్ గురించి విన్నారా? ముందుకి 35 గేర్లు, వెనక్కి 7 గేర్లు?

అవును, ఇది వింతైన సైకిల్ అని చెప్పుకోక తప్పదు.ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత భారీ, బరువైన సైకిల్ ఇది మరి.

అయితే ఆ భారీ సైకిల్ ను చూసినవారు ఇది బుల్డోజర్ లాగా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గాని, మీరు విన్నది నిజమే.ఆ సైజు అలాంటిది మరి.సాధారణంగా సైకిళ్లకు గేర్లు ఉండవు.కానీ ఈ భారీ సైకిల్ ముందుకు వెళ్లాంటే 35 గేర్లు, వెనక్కి వెళ్లాలంటే మరో 7 గేర్లు వేయాల్సిందే.

లేదంటే కదిలే ప్రసక్తేలేదు మరి.ఈ భారీ సైకిల్ టైర్లు కూడా భారీగానే ఉంటాయి.కావాలంటే ఇక్కడ ఫొటోలో గమనించండి.

దాదాపు ట్రాక్టర్ టైర్లంత భారీగా వున్నాయి కదూ.దీనికి ఎక్కువ టైర్లు ఉండడం గమనించవచ్చు.మరి ఇన్ని టైర్లు ఉన్నదాన్ని సైకిల్ అని ఎందుకంటారు అనే అనుమానం రాకమానదు.

Advertisement

విషయంలోకి వెళితే, జర్మనీలోని డుసెల్డోర్ఫ్‌లో ఇటీవల నిర్వహించిన ‘సైక్లింగ్‌ వరల్డ్‌ బైక్‌ షో’లో క్లైన్‌ జొహన్నా( Kleine Johanna ) అనే సైకిల్‌ వీక్షకులను విపరీతంగా ఆకర్శించింది.దాని సైజుతో పాటు దాని ప్రత్యేకతలు తెలిసి జనాలు ఆశ్చర్యపోయారు.

ఎందుకంటే ఈ బుల్డోజర్ లాంటి సైకిల్ బరువు దాదాపు 2,177 కిలోలు.ఇనుప సామాన్ల వ్యర్ధాల నుంచి తెచ్చిన వస్తువులతో ఈ భారీ సైకిల్ ను తయారు చేశారు సెబాస్టియన్‌ అనే వ్యక్తి.

అవును, దీనిని తయారు చేయడం వెనుక ఓ మంచి ఆలోచన వుంది మరి.సెబాస్టియన్ స్క్రాప్ ( Sebastian Scrap )తో వాహనాలను తయారు చేస్తుంటారు.అలా ఇనుము పరికరాల వ్యర్ధాలతో 5 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తు కలిగిన ఈ భారీ సైకిల్ ను రూపొందించారు.

స్క్రాప్ ని ఇలా రీ యూజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా తయారు చేసానని అతగాడు చెప్పుకొస్తున్నారు.స్క్రాప్ విపరీతంగా గ్లోబల్ వార్మింగ్( Global warming ) కి కారణం అవుతున్నవేళ ఇలా తాను ఏదైనా చేసి చూపాలని భావించానని చెబుతున్నాడు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?

నిజంగా అద్భుతం కదూ.కాగా ఇన్ని ప్రత్యేకలు ఉన్న ఈ భారీ సైకిల్ ఇన్స్టిట్యూట్ ఫర్ జర్మనీ ద్వారా ప్రపంచంలోనే అత్యంత బరువైన సైకిల్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు